మొన్నటికి మొన్న అరియానా, అషూ రెడ్డి లను బాగా పాపులర్ చేసిన ఆర్.జి.వి ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా విస్తరిస్తున్న మరొక వేరియంట్
ఒమిక్రాన్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్నటికి నిన్న ఒమిక్రాన్ ను అరికట్టడానికి రాత్రి మాత్రమే కర్ఫ్యూ విధిస్తే ఎలా సాధ్యం అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా డెల్టా వేరియంట్ గురించి చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడు తాజాగా మీడియా ఫోకస్ చేయాల్సింది పట్టణంలోకి కొత్తగా వచ్చిన అమ్మాయి అదే ఒమిక్రాన్.. కానీ అతి భయంకరమైన నిజమైన ప్రమాదం ఏమిటంటే మాజీ అమ్మాయి అయినా డెల్టా వైరస్ మృత్యువుతో ఆటాడింది. నిజానికి డెల్టా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయానికొస్తే ఒక్కరోజులోనే ముంబైలో దాదాపుగా 1000 కేసులు నమోదు చేయడం గమనార్హం . కాబట్టి ఈ సరికొత్త అమ్మాయి అయిన ఒమిక్రాన్ పై మీడియా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ రాంగోపాల్ వర్మ తెలపడంతో ప్రస్తుతం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మీడియా కూడా ఈ కేసుల పై ఫోకస్ చేయడం గమనార్హం.