ఇక ఇదిలాఉంటే అఖండ సినిమాలో జై బాలయ్య సింగేచర్ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆ స్టెప్పుకు డ్యాన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మాస్ మహరాజ్ రవితేజతో కూడా బాలకృష్ణ ఆ స్టెప్ వేయించాడు బాలకృష్ణ. అంతేకాదు లేటెస్ట్ గా హీరోయిన్ నివేదా థామస్ కూడా జై బాలయ్య స్టెప్పుని ట్రై చేసింది. ఇవన్ని ఒక ఎత్తైతే ఫారిన్ అమ్మాఇయ్లు కూడా బాలయ్య పాటకి కాలు కదిపారు. ఓ ముగ్గురు విదేశీ భామలు జై బాలయ్య డ్యాన్స్ చేసిన వీడియో అఖండ నిర్మాత రవీందర్ రెడ్డి తన బ్యానర్ ద్వారకా క్రియేషన్స్ ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశారు.
ది యుఫోరియా ఆఫ్ జై బాలయ్య ఈజ్ ఆల్ ఓవర్.. థ రోర్ ఆఫ్ అఖండ కంటిన్యూస్ బుక్ యువర్ టికెట్స్ అంటూ ద్వారా క్రియేషన్స్ ట్విట్టర్ పేజ్ లో పెట్టారు. అఖండ సక్సెస్ ను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్. బాలయ్యతో సినిమా తీసి హిట్టు కొట్టడం అది బాలయ్య వల్లే అవుతుందని అందరు అనుకునేలా చేశాడు. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాలకృష్ణ ఫ్యాక్షన్ స్టోరీతో వస్తున్నాడు. సినిమా మీద డైరక్టర్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.