ఈ సినిమాని 2022 సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వచ్చిందంటే... విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి.. ఇక వీరు అనుకున్న సమయానికి బాలీవుడ్లో ఒక బడా సినిమా విడుదల కాబోతున్న ట్లు సమాచారం. అందుచేతనే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం.
అయితే సినిమా విడుదల తేది ఏమో కానీ.. ఈ సినిమా సంబంధించి ఇప్పుడు ఒక వార్తా బాగా వినిపిస్తున్నది ఏమిటంటే.. లో ఒక క్లాసిక్ పాటలు రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.."మెహబూబా మెహబూబా అనే పాటను రీమిక్స్ చేసి సినిమాలో పెట్టబోతున్నట్లు గా తెలుస్తోంది. అందుకోసం హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్ సెట్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్ కనిపించబోతోంది అనే వార్త కూడా బాగా వినిపిస్తోంది. ఆమె ఒక స్టార్ హీరోయిన్ అట.