డిసెంబర్ 31.. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైన రోజు.. కారణం ఎన్నో బాధలు మరెన్నో సంతోషాలు ఇంకెన్నో తీపి జ్ఞాపకాలు అన్నింటినీ అందించిన పాత సంవత్సరానికి స్వస్తిపలికుతూ కొత్త గా జీవితాన్ని ప్రారంభించేందుకు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికే రోజు 31 డిసెంబర్. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 రోజున ఎంత ఎంజాయ్ చేస్తారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒకే దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా డిసెంబర్ 31 నైట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే అందరికీ ఆ రోజు ఎంతో స్పెషల్. అయితే ఇలాంటి స్పెషల్ డేస్ ను మరింత స్పెషల్ గా మార్చేందుకు ఈటీవీ నిర్వాహకులు ఎప్పుడూ సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ప్రతి పండక్కీ సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేస్తూ మరింత గ్రాండ్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేక్షకులందరినీ టీవీలకు కట్టిపడేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31 రోజున పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమం టైటిల్ తోనే ఎంతోమందిని ఆకర్షించారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోలు విడుదల చేస్తూ వరుసగా బుల్లితెర ప్రేక్షకులు అందరిలో మరింత ఆసక్తిని పెంచుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఈ ఈవెంట్ జరగడం ఒక ఎత్తయితే ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రావడం మరొక ఎత్తు. వర్మ రావడంతో ఇక ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.



 ఇకపోతే ఇటీవలే పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు  అనే కార్యక్రమానికి సంబంధించి మరో ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో కూడా ఎంతో సందడి సందడి గా సాగిపోయింది అనే చెప్పాలి. ఈ ప్రోమో లో యాంకర్ రష్మీ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అదే సమయంలో అటు రామ్ గోపాల్ వర్మ  కూడా అక్కడ ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఆర్జివి చెప్పిన సమాధానాలతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక  చివరిలో  స్టేజ్ మీద ఉన్న వారందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతారు. అదే సమయంలో వర్మ మాట్లాడుతూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఉన్న మూర్ఖులు అందరూ  సంతోష పడతారు కాబట్టి.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పి అందరినీ మాటల్లో మాటగా మూర్ఖులు అని అనేసాడు  వర్మ. దీంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: