రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కెరీర్ లో తొలిసారిగా కలిసి నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తుండగా ఒలీవియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం బీమ్ గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రియ శరన్, రాజీవ్ కనకాల, సముద్రఖని కనిపించనున్నారు. అయితే బాహుబలి సినిమాల తరువాత రాజమౌళి తీస్తున్న భారీ సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, టీజర్లు అన్ని ఎంతో ఆకట్టుకోవడంతో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయం అని అందరూ నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాని జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భర్తీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించి ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉంది. అయితే కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా కేసులు పెడుతూ ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి అక్కడి ప్రభుత్వాలు. దానితో అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ వారు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. మరోవైపు పలు రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీస్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉందని, ముఖ్యంగా ఆర్ ఆర్ఆర్ పక్కాగా వాయిదా గ్యారెంటి అంటూ మరికొందరు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

అయితే నిన్న త్రివేడ్రంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమాని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి యూనిట్ తెరకెక్కించిందని, తప్పకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తపరిచిన రాజమౌళి, పక్కాగా మూవీ జనవరి 7న రిలీజ్ అవుతుందని అన్నారు. మరోవైపు నిర్మాత దానయ్య కొన్ని ప్రాంతాల్లో ఉన్న టికెట్ సమస్యలతో పాటు థియేటర్స్ ఆంక్షల విషయమై ప్రభుత్వాలతో చర్చిస్తున్నారని, రిలీజ్ సమయానికి అవన్నీ ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మరి అందరిలో ఎన్నో అంచనాలు పెంచిన ఆర్ఆర్ఆర్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: