యూవీ క్రియేషన్స్ పతాకంపై భూషణ్ కుమార్ , వంశీ కలిసి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ఎంటర్టైన్మెంట్ చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాను నిర్మాతలు ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోగా,, రొమాంటిక్ గాయ్ గా కనిపించడానికి సిద్ధమయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా తనదైన శైలిలో నటించడానికి.. అందర్నీ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సీన్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా ప్రేక్షకులలో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇకపోతే మొట్టమొదటిసారి అన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ డ్రామా సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్  సినిమా తర్వాత కేవలం ఒకే ఒక్క వారం గ్యాప్ లో రాధేశ్యామ్ సినిమాను సంక్రాంతి కానుకగా అంటే జనవరి - 14 - 2022 న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ఇండియాలో విడుదల చేసినప్పటికీ ప్యారిస్లో మాత్రం ఇంకా విడుదల చేయలేక పోయారు.


ఇకపోతే తాజాగా ఫ్రాన్స్ లో ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఈ పోస్టర్ లో  ప్రభాస్ లుక్ అదిరిపోయేలా ఉండడంతోపాటు పూజా హెగ్డే రొమాన్స్ కూడా బాగా కనిపిస్తోంది . అంతేకాదు వీరిద్దరి ఫోటో తో పాటు ఈఫిల్ టవర్ ఉన్న ఇమేజ్ ను కూడా జోడించడం గమనార్హం. ఇకపోతే ఈ పోస్ట్ చూసిన అభిమానులు సినిమా ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అంటూ రకరకాలుగా తమ ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: