మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేగవంతంగా సినిమాలను నిర్మించే డైరెక్టర్లలో డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒకరు. కానీ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్  వచ్చిన తర్వాత చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్య సినిమా షూటింగ్ కూడా రోజురోజుకు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇకపోతే భరత్ అనే నేను సినిమా తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి.. సరిలేరు నీకెవ్వరు.. అనే సినిమాలు విడుదల కాగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. కానీ మహేష్ బాబుకు శస్త్రచికిత్స జరగడం వల్ల అది కూడా షూటింగ్ ఆలస్యం అవడం గమనార్హం.ఇకపోతే కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తర్వాత వెంటనే దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే కొరటాల శివ తప్పనిసరిగా విజయాన్ని సాధించే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదైనా ఒక మంచి మెసేజ్ కూడా ప్రేక్షకులకు తెలిసేలా కొరటాల శివ తన సినిమాలలో జాగ్రత్త తీసుకుంటారు. ఇక పోతే మల్టీస్టారర్ మూవీగా చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య  సినిమాతో కూడా  ఒక మంచి మెసేజ్ ను  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన తెలిపాడు.. ఈ సినిమా సెకండాఫ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన లాభాలు అయినా నష్టాలైనా బాధ్యత మాత్రం కొరటాల శివకి అని తెలుస్తోంది. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ విషయంలో కొరటాల శివ కూడా వాటా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ పనులను కూడా ఆయనే స్వయంగా చూసుకోవడం గమనార్హం. సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బాధ్యతలను కూడా కొరటాల శివ తన పై వేసుకున్నారట . ఇక అసలు విషయం ఏమిటంటే ఆచార్య సినిమాకు కనుక ఒకవేళ నష్టం వస్తే కొరటాల శివ తన చేతి నుండి డబ్బులు ఇస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: