తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి షాపింగ్ మాల్ మూవీ ద్వారా పరిచయమైంది హీరోయిన్ అంజలి. తెలుగు అందం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె తెలుగులో పాటు, తమిళ వంటి భాషలలో కూడా నటించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన కొన్ని సినిమాలలో నటించింది ఈమె. తాజాగా వకీల్ సాబ్ సినిమాలో కూడా.. ముస్లిం పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. 2013వ సంవత్సరంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన.SVSC (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) మూవీలో వెంకటేష్ సరసన నటించింది. ఇందులో మరొక కథానాయకుడు మహేష్ బాబు కూడా నటించాడు.ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అంజలి. దీంతో ఈమెకు వరుస అవకాశాలు బాగానే వెలుబడ్డాయి. ఇక ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ "గీతాంజలి"వంటి మూవీతో కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే కాలక్రమేణా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా వకీల్ సాబ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది.. కానీ ఈ సినిమా ప్రమోషన్ లో చాలా హాట్ హాట్ ఫోజులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తన శ్రద్ధనంతా ఎక్కువగా తన బాడీ ఫిట్నెస్ పైనే పెట్టినట్టుగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది.

అయితే ఏదైనా హీరోయిన్ ఒక సినిమాలో సక్సెస్ అయ్యిందంటే చాలు వరుస అవకాశాలు వెలువడుతూనే ఉంటాయి.. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అలా జరగలేదు.. ప్రస్తుత రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమాలో ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఎంతో బడ్జెట్ తో తెరకెక్కించారు అనే సమాచారం జరుగుతోంది. ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. మరికొంత మంది నటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: