ఈ తరుణంలోనే తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు సినీ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటి దాకా కూడా తండ్రి తనయుడు ఇద్దరూ ఒకరి సినిమాల్లో ఒకరు సాంగ్స్ లో ఒక సీన్ లో ఇలా కనిపించి అభిమానులను మురిపించి అలా మాయమైపోయిన సంగతి అందరికి తెల్సిందే. అలాగే ఆచార్య మూవీలో మాత్రం రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ సినిమాకు అదనపు హంగులను తీసుకొచ్చారని సమాచారం.
అంతేకాదు.. 'ఆచార్య' సినిమాలో చరణ్ ఎంతసేపు ఉంటాడనే చర్చ తాజాగా ఆసక్తి కలిగిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించి పలు రకాల వ్యాఖ్యలు వినబడుతూనే ఉన్నాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. మెగా పవర్‌స్టార్ పాత్ర నిడివి 45 నిమిషాలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఫస్టాఫ్ చివర్లో చరణ్ ఎంట్రీ ఇస్తాడని, సెకండాఫ్‌లో దాదాపు 40 నిమిషాల వరకు ఈ మెగా హీరో పాత్ర ఉంటుందని సమాచారం. దీంతో పాటు రామ్ చరణ్ క్యారెక్టర్ పై మరో రూమర్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మూవీలో చెర్రీ.. ఆచార్య మెగాస్టార్ చిరంజీవికి అంగరక్షకుడిగా ఉంటాడనే టాక్ ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ విషయంపై పై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.