ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సోదరులు పాల్గొన్నారు .. వారిలో ఒకరు మాట్లాడుతూ .. "మా చిన్న కొడుకు 'ఆర్య' చాలా లావుగా అయ్యాడు. చదువుకోకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా తిరుగుతుండేవాడు. సిగరెట్లు కూడా తాగుతున్నాడని నా భార్య చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? అనేది నాకు అసలు అర్థం కాలేదు .నేను కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. మా అబ్బాయేమో నేను వచ్చి కొడతానని తెగ భయపడుతున్నాడు. తండ్రిగా నేను వాడికి అన్నం పెడుతున్నాను కాబట్టి వాడిని తిట్టే అధికారం ఇంకా కొట్టే అధికారం నాకు ఉన్నాయి. నేను ముందుగా తిడతాను .. ఇంకా అవసరమైతే కొడతాను. ఇక ఈ రెండూ కాకుండా ఇంకా ఏం చేయగలమనే ఆలోచన చేశాను. నేనిక నిదానంగా వెళ్లి మా అబ్బాయి కాళ్లు పట్టుకున్నాను. 'ఒరేయ్ నీ గురించి అమ్మ ఇలా చెప్పింది. అందుకు నేను నిన్ను తిట్టొచ్చు  కొట్టొచ్చు లేదా నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు.

నిన్ను మందలించవలసిన అధికారం అనేది బాధ్యత ఒక తండ్రిగా నాకున్నాయి. కానీ అవేమీ నేను చేయడం లేదు. ముందు నువ్వు మా గురించి ఒక ఆలోచన చేయి. సినిమా ఇండస్ట్రీలో రామ్ - లక్ష్మణ్ ఎలా ఉన్నారు? ఇక వాళ్ల స్థితిగతులేంటి? అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. అప్పుడు రామ్ - లక్ష్మణ్ కొడుకు ఎలా ఉండాలనేది నీకు అర్థమవుతుంది. అలా వాడికి ఆ విషయాన్ని నేను ఒక 10 నిమిషాలు పాటు చెప్పడం జరిగింది. దాంతో వాడు ఒక 6 నెలల్లో పూర్తిగా మారిపోవడం జరిగింది. ఇక అంతకుముందు 120 కేజీలు ఉండే వాడు ఇప్పుడు 70 కేజీలకు వచ్చేశాడు. మిగతా అన్ని చెడు అలవాట్లు కూడా మానేశాడు. పిల్లలు చెడు మార్గంలో వెళుతున్నప్పుడు  వారికి ఒక రకమైన ద్వేషంతో ఉన్నప్పుడు మనం అదే అప్లై చేయకూడదు. అలా చేస్తే సమస్య తీరకపోగా మళ్ళీ ఆ గొడవ మరింత పెద్దదవుతుంది. ప్రేమతో ప్రపంచాన్ని మార్చవచ్చు. కాని ద్వేషంతో ఒక్కరినీ కూడా మార్చలేము" అంటూ వారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: