ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తో ఆయన లైగర్ అనే సినిమా చేస్తుండడం విశేషం. ఏదైనా సినిమా చూస్తే పూరి జగన్నాథ్ సదరు హీరో తో చాలా దగ్గర అయిపోతాడు. మంచి రిలేషన్షిప్ ఏర్పరుచుకుంటాడు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన సినిమాలు చూసిన ప్రతి హీరోతో కూడా మంచి అనుబంధం ఏర్పరుచుకుని వారితో ఇప్పటికీ ఎంతో కలిసిమెలిసి ఉంటున్నాడు. ఆ విధంగా విజయ్ దేవరకొండ తో ఆయన చేసింది ఒక్క సినిమానే అయినా ఆయనతో విపరీతమైన అనుబంధం ఏర్పరుచుకుని మరొక సినిమా చేసే విధంగా వీరి అనుబంధం కొనసాగుతున్నట్లు గా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.
విజయ్ దేవరకొండ హీరో గా చేస్తున్న ఈ సినిమానే కాకుండా మరొక సినిమాను కూడా పూరి జగన్నాథ్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు అని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని పూరి భావిస్తుండటం విశేషం. ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని గతంలో ప్రయత్నించగా పూరి జగన్నాథ్ కు ఆయన డేట్ లు ఇవ్వకపోవడం పెద్ద వివాదం అయింది. దాంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించిన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ చేయాలనుకోవడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతగానో ఖుషి చేస్తుంది. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందట.