సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా షన్నూ, దీప్తి బ్రేక్‌అప్ గురించి వైరల్‌గా మారింది. ఇక సోషల్ మీడియా మొత్తం వీళ్ళ గురించే చర్చించుకుంటున్నారు. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్స్ కొందరూ ఈ విషయమై ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా షన్నూపై దీప్తి కోపంతో బ్రేకప్ చెప్పడం.. షన్నూ కూడా దీప్తికి అప్పట్లో బ్రేకప్ చెప్పడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఆ సమయంలో స్నేహితులే వీళ్లను మళ్లీ కలిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం మళ్లీ ఆ స్నేహితులే వాళ్లను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్క విధంగా చెప్పాలంటే.. నూటికి నూరు శాతం షన్నూకు ఆమెతో కలిసి జీవితాన్ని సాగించాలనే ఆశ.. కోరిక.. ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మరో వైపు దీప్తికి కూడా షన్నూపై చాలా ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. బ్రేక్ అప్ చెప్పిన తరువాత దీప్తి మొదటిసారి లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కనిపించింది. ఈ కారణంగా అయినా వారు ఖచ్చితంగా మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు నమ్మకంగా చెబుతున్నారు. అలా జరిగితే ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వీరిద్దరూ విడిపోవడంతో ఎంతో మంది.. తొందరగా వీరిద్దరు కలవాలని ఎదురు చూస్తున్నారు.
అంతేకాదు.. షన్నూ బిగ్‌బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక.. ఇటీవల వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్‌ను నిర్వహించిన సందర్భంగా దీప్తిని కలుస్తాను అంటూ వెల్లడించారు. అంతేకాదు.. దీప్తి సునైనాతో మాట్లాడాలి అనుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ఇద్దరి మధ్య కూర్చుని మాట్లాడితే రాజీ కుదిరే అవకాశాలు లేక పోలేదు అని స్నేహితులు చెప్పుకొస్తున్నారు. మరోసారి స్నేహితులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరువైపులా కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.. అసలు బ్రేకప్‌కు వాళ్లు ఏమైనా కారణం అయ్యి ఉంటారా అనేది దాని గురించి తెలియాల్సి ఉంది. వీళ్ళ స్నేహితులు ఎవరో కాని బలంగా ప్రయత్నించి వారిని కలిపితే బాగుంటుందని నెటిజన్స్ కోరుకుంటున్నారు.