భారీ పారితోషికం అందుకొని కొంతమంది భామలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త తగ్గుముఖం పట్టిన భామలే.. ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా ముందుగా హీరోయిన్ కాజల్, జనతా గ్యారేజ్ లో నటించింది.. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఈమెకు ఈ పాటలో నటించడం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. శృతి హాసన్ కూడా ఆగడు సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. తాజాగా హీరోయిన్ సమంత కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగానే అలరించింది.. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా రెజీనా సరికొత్తగా ఐటెం సాంగ్ లో నటిస్తోంది. దీంతో రెజీనా కాస్త లేటుగా ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు.. ఈ సినిమాతోనైనా ఈమె ఫేట్ మారుతుందేమో చూడాలి.
మన హీరోయిన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాలీవుడ్ ఐటెం గర్ల్స్ , టాలీవుడ్ లో ఉండే కొంతమంది ఐటెం గర్ల్స్ కు అవకాశాలు రాకుండా వారి పొట్ట మీద కొడుతున్నారు. అయితే ఇందులో కొందరు స్టార్ హీరోయిన్లు ఐటం గర్ల్ గా నటించడం గమనార్హం. మరికొంతమంది ఎలాగో వారి హవా తగ్గిందని ఇలాంటి పాటలలో చేస్తున్నారు.