ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో మహేష్ బాబు సూర్య భాయ్ అనే పాత్ర చేసారు. మహేష్ వన్ మ్యాన్ షో తో పాటు ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాని తెరక్కించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆ తరువాత వీరిద్దరూ కలిసి మరొక సినిమా చేస్తే చూడాలని అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఆడియన్స్ సైతం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే విషయం లోకి వెళితే, త్వరలో బిజినెస్ మ్యాన్ మూవీ రిలీజ్ అయి సక్సెఫ్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం నేడు రాజమండ్రి ఊర్వశి థియేటర్ లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా ఎందరో ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేసి ఆ షోని ఎంతో విజయవంతం చేసారు.
ఆ షో లో మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరొకవైపు నేడు ఉదయం నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ప్రకారం ఇటీవల మహేష్ దుబాయ్ వెళ్లబోయే ముందు ఆయనని తన నివాసంలో ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ కలిసారని, అలానే తమ కాంబోలో తదుపరి చేయబోయే బిజినెస్ మేన్ 2 మూవీ స్టోరీ ని మహేష్ కి వినిపించిన పూరి, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, త్వరలో స్క్రిప్ట్ పూర్తి చేసే పనులు ప్రారంభించనున్న పూరి, ఈ ఏడాది చివరిలో దీనిని పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి.