కాకపోతే అస్సలు అప్పుడయినా విడుదలకు సిద్ధం అవుతాడా ? లేక ఎప్పటిలాగే ఏదొక కారణం చెప్పి.. విడుదల వాయిదా వేస్తాడా ? అన్నదే ప్రధాన అనుమానమని తెలుస్తుంది.ఇప్పటికి అయితే భీమ్లా నాయక్ మేకర్లకు అసలు క్లారిటీ లేదని తెలుస్తుంది.
తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి ? అసలు ఆ మాటకొస్తే అనుకున్న విధంగా షూటింగ్ చేయగలమా అనే భయంలో ఉందట ఈ సినిమా టీమ్. ఒకటి కరోనా భయం అయితే మరొకటి పవన్ డేట్లు భయమని తెలుస్తుంది.పవన్ ఈ సినిమా కోసం కేటాయించిన డేట్లు అన్నీ ఇప్పటికే అయిపోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పవన్ నుంచి అదనపు డేట్లు అడగాలి అంటే.. కాస్త ఇబ్బందేనని తెలుస్తుంది.
పవన్ మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్ళండి అంటూ చాలాసార్లు చెప్పాడట.. కానీ, భీమ్లా నాయక్ టీమ్ ఆ విషయంలో అసలు క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు షూటింగ్ చేస్తూవెళ్ళింది.కష్టం అనిపిస్తే.. షూట్ కి లాంగ్ గ్యాప్ ఇస్తూ ముందుకు పోయిందట.మొత్తమ్మీద భీమ్లా నాయక్ విడుదల పై అనేక అనుమానాలు ఇంకా చాలానే ఉన్నాయి.
అన్నిటికీ మించి రిలీజ్ అయ్యే నాటికి కరోనా కనుక తగ్గకుండా అలాగే కనుక వుంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది.. మరోపక్క పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఎప్పుడు తొక్కేద్దాం అంటూ జగన్ బాగా పట్టుదలగా ఉన్నాడట.సో.. పవన్ సినిమా వస్తే కనుక జగన్ థియేటర్లకు ఫిప్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదా మరో కారణం చెప్పి థియేటర్స్ ను సీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే భయం భీమ్లా నాయక్ ను బాగా వెంటాడుతుందట..