అందంతో పాటు అమ్మడుకి మరో ప్లస్ పాయింట్ డ్యాన్స్ ఎటువంటి స్టెప్స్ ని అయిన అలవోకగా చేసే టాలెంట్ ఉన్న తమన్నా డ్యాన్స్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక నటన పరంగా కూడా తమన్నా ఏం తీసిపోదు..ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, రీవేంజ్ సీన్స్ లో అమ్మడు ఎలా చెలరేగిపోతుందో ఇప్పటికే ఆమె నటించిన సినిమాల్లో మనం చూశాం. అయితే కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తమన్నా హవా కాస్త తగ్గింది. ఇప్పుడు యంగ్ హీరోలకు ఆమె అవసరం లేదు. దీంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఏదో వచ్చిన అరా కొరా సినిమాలను సైన్ చేస్తూ..కాలం గడుపుతుంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాలో ఆయనకు భార్య గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 2 కోట్ల 50 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలో..కొందరు నెటిజన్స్ అమ్మడుకి అంత ఇచ్చి సినిమాలో పెట్టుకునే సీన్ లేదు అంటూ నెట్టింట ట్రోల్స్ చేసారు. దీనికి కౌంటర్ ఇస్తూ తమన్నా.."నాకు ఏం ఊరికే ఇవ్వట్లేదు. నాలోని అన్నీ టాలెంటెడ్ యాంగిల్స్ చూయిస్తున్న. అందుకే నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు" అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుని ట్రోలింగ్స్ గురించి బాధపడిందట.