యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రాధే శ్యామ్" .ఇక ఈ సినిమా ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుంది.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మనోజ్ పరమహంస కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. 

ఇక ఆ కార్యక్రమంలో భాగంగా  సినిమాలు ప్రభాస్ లుక్ గురించి మాట్లాడుతూ బాహుబలి సినిమా తర్వాత మేము ప్రభాస్ సార్ ని సరికొత్తగా మరోలా చూడాలి అనుకుంటున్నాము.  సరికొత్త లుక్ లో ప్రజెంట్ చేయాలని అనుకున్నాము. దీనికోసం వర్షం సినిమాను మేము మళ్లీ చూడవలసి వచ్చింది. ఇక అప్పుడు మాకు కు ఒక ఐడియా వచ్చింది. ఇకపోతే నాకు ఇష్టమైన సినిమా లో వర్షం సినిమా కూడా ఒకటి. అయితే వర్షం సినిమా వచ్చి దాదాపు 10 నుండి 15 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నాకు ఈ సినిమా అంటే ఇప్పటికీ ఇష్టమే. అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు మనోజ్ పరమహంస.

ఇక మరోవైపు జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్,ఓమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్ కూడా అమలు చేశారు.ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో సినిమా థియేటర్స్, స్కూల్స్ కూడా మూసివేశారు. దీంతో చిత్ర యూనిట్ సినిమా విడుదలను వాయిదా వేసింది. అయితే కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.ఇక సినిమా విడుదల వాయిదా వేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: