టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఒక వెలుగు వెలిగిన నటి శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్‌లో కూడా రాణిస్తుంది. అయితే గమనం చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో అద్భుతంగా నటించారు. తొలుత ఆ సినిమా కథ విన్నప్పుడు శ్రియా ఏడ్చేసిందట. ఆ సినిమాలోని పాత్ర కోసం బట్టలు కుట్టడం కూడా నేర్చుకుందట. అంతేకాదు నా సినీ ప్రయాణానికి తొలుత ప్రేక్షకుల ప్రేమనే కారణం అని పలుమార్లు పేర్కొంది. మరొక ఇరవై ఏళ్ల ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉన్నదని కూడా పలుమార్లు శ్రియా తెలిపింది. శ్రియా సినిమాల్లోకి రావడానికి ప్రేక్షకులే కారణమట. ఒకానొక సందర్భంలో శ్రియా ప్రేక్షకులను చూసి ఆశ్చర్యపోయిందట.
ఇరవై ఏళ్ల కాలం నుంచి సినిమాల్లో నటిస్తున్నాను. మళ్లీ నటిస్తాను. అందుకోసం కష్టపడుతాను అని ఓ సందర్భంలో పేర్కొంది. శ్రియా అక్కినేని నాగేశ్వరరావు గారు చివరిక్షణం వరకు నటించారు. ముఖ్యంగా మనం సినిమా సమయంలో ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను అని ఆయన అన్న మాటలు నాకు చాలా గుర్తుకు ఉన్నాయి. అక్కినేని మాదిరిగా చివరి క్షణం వరకు నటించాలని ఉందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రియా పెళ్లి జరిగిన తరువాత కూడా సినిమాల్లో నటించి.. జీవితాంతం నటిస్తాను అనడం ఆసక్తికరమైన అంశమే అని చెప్పవచ్చు.