ఇప్పుడు స్టార్ హీరోల దగ్గర నుండి డైరెక్టర్స్ , ప్రోడ్యూసర్స్ అందరు కూడా కలవరిస్తున్న పేరు కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకుంది అంటే అమ్మడు భవిష్యత్తు రానున్న రోజుల్లో ఏ స్దాయిలో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమా ద్వార ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ సోయగం..ఫస్ట్ సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత అమ్మడి అందాలను చూసి ఫిదా అవుతున్న కుర్రాళ్లను గమనించిన స్టార్ డైరెక్టర్స్ ..కృతి పై కన్నేసారు.

దీంతో అమ్మడుకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే చేతినిండా సినిమాలతో మరో రెండేళ్ళు పాటు బిజీ గా కాల్ షీట్స్ నింపుకున్న ఈ బ్యూటీకి అద్దిరిపోయే ఆఫర్ అందిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు యింగ్ హీరోలతోనే నటించే అవకాశం అందుకున్న కృతిశెట్టికి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ లో కావడం మరింత హాట్ న్యూస్ గా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు..తెర పై ఈ కాంబో పడితే బ్లాస్ట్ పక్క. ఇక వీరి కాంబోలో ఓ సినిమా రాబోతుంది అని తెలిసిన విషయమే. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా సమంత ఫైనల్ అయ్యిన్నట్లు వార్తలు వినిపించాయి. మొదట పూజాని అనుకున్న  త్రివిక్రమ్  అమ్మడు కాల్ షీట్స్ ఖాళీ గా లేకపోవడంతో ఆ ఆఫర్ సమంతకు ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కుర్ర భామ కృతిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ఆయన రాసుకున్న కధకు సెకండ్ హీరోయిన్ గా అయితే కృతి సెట్ అవుతుందని భావించిన డైరెక్టర్ ..కృతిని ఫిక్స్ చేసారట. మరి కొద్దిరోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ గా స్పందిస్తున్నారు..మహేష్ పక్కన కృతి టూ బ్యాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ పక్కన హీరోయిన్ గా చేయాలంటే ఓ రేంజ్ ఉండాలి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: