![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/karthi-moviedec20c67-eb7b-4bbc-bc6e-4b053101a8e2-415x250.jpg)
తాజాగా ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ ఆ తర్వాత కూడా వినూత్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా చేస్తూ ఉండగా తాజాగా నాపేరు సూర్య సినిమాకు సీక్వెల్ విడుదల అవుతుందని ప్రకటించడం ఒక్కసారిగా ఆయన అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది అనేది కూడా తమకు తెలియదని అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటించడం ఆశ్చర్యపరుస్తుంది అని అందరూ చెబుతున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో చేసిన మద్రాసి అనే సినిమాకు ఈ టైటిల్ పెట్టి తెలుగులో దానిని విడుదల చేస్తున్నారు అని తెలుస్తుంది. మద్రాస్ చిత్రం అక్కడ మంచి హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా అప్పట్లో తెలుగు లోకి రావడం ఎలానో మిస్ అయింది. దాంతో ఇంత మంచి చిత్రాన్ని తెలుగులో తప్పకుండా అందరూ చూసి తీరాల్సిందే అని భావించి నిర్మాతలు ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. మరి తమిళనాట సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే సంచలనం సృష్టించి సూపర్ హిట్ దిశగా ముందుకు వెళుతుందా అనేది చూడాలి. ఇకపోతే కార్తి హీరోగా సర్దార్ అనే సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో ముసలివాడిగా కనిపించనున్నాడు కార్తి.