అయితే చివర్లో సినిమా తెలుగు వర్షన్ ఆగిపోయింది. మానాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తమిళ వర్షన్ ఒకరోజు లేట్ గా రిలీజైంది. మానాడు తెలుగు రిలీజ్ ను గీతా ఆర్ట్స్ తో డీల్ కుదిరింది. అయితే చివరి నిమిషంలో ది లూప్ తెలుగు వర్షన్ ఆపేశారు. అయితే సినిమా అక్కడ హిట్ అవడంతో సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమా రీమేక్ కోసం మానాడు నిర్మాతలను సంప్రదించారు. సురేష్ ప్రొడక్షన్స్ కు మానాడు రైట్స్ ఇచ్చారు. అయితే తెలుగు వర్షన్ మాత్రం శింబు తన డబ్బింగ్ వర్షన్ నే రిలీజ్ చేయాలని అంటున్నాడట. తెలుగులో ఇదివరకు తనకున్న మార్కెట్ ని మళ్లీ పొందేందుకు మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ అక్కడ రిలీజ్ చేయాలని నిర్మాతలని డిమాండ్ చేస్తున్నాడట.
ఒకవేళ రీమేక్ చేయాలని అనుకుంటే మాత్రం తనకు 5 కోట్లు ఇవ్వాలని ట్విస్ట్ ఇచ్చాడట. శింబు ఇచ్చిన షాక్ కి సురేష్ ప్రొడక్షన్ వారు ఏం చేయాలో తోచక ఆలోచనలో పడ్డారట. మానాడు రీమేక్ అయితే దగ్గుబాటి హీరో రానా ఆ సినిమాలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు తెలుగు రీమేక్ ఉంటుందా లేక శింబు డబ్బింగ్ వర్షన్ నే రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.