మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా పెద్ద సినిమాలకు ఎన్నో తిప్పలు ఏర్పడ్డాయి. ఒకవైపు షూటింగ్ ఆగిపోయి.. మరోవైపు విడుదల తేదీ దాటిపోయి..  భారీ సినిమాలను నిర్మించే చిత్రబృందాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులకు సద్దుమణుగుతున్నాయ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద సినిమాలను విడుదల చేయొచ్చు అని అందరు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలు గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యాం  లాంటి సినిమాలను విడుదల చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ అంతలోనే సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ భారత్లో కూడా చాపకింద నీరులా పాకిపోతోంది.



 దీంతో ఎన్నో రాష్ట్రాలలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలు లోకి వస్తున్నాయి. దీంతో భారీ బడ్జెట్ సినిమాలకు మళ్లీ భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా  చివరికి మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇక అదే సమయంలో మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యాం కూడా వాయిదాపడుతుందేమో అని అందరూ భయపడ్డారు. అనుకున్నదే జరిగింది. రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ఆఫీసియల్ గా ప్రకటన చేసింది. దీంతో ఇక అటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు.


 అయితే ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్, రాధేశ్యాం బాటలోనే మరో సినిమా కూడా వాయిదా పడేందుకు  సిద్ధం అవుతుంది అని అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి రామ్చరణ్ కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య  సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 4వ తేదిన విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా వాయిదా పడబోతుంది అని ప్రస్తుతం టాలీవుడ్ కోడైకూస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ఫిబ్రవరి నాటికి ఇక మరిన్ని ఆంక్షలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  దీంతో ఇక ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావలసి ఉన్నప్పటికీ వాయిదా వేయడానికి చిత్రబృందం సిద్ధంగా ఉంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: