ఇకపోతే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మోకాలు సర్జరీ చేయించుకోవడం కోసం వెళ్లి.. చికిత్స నిమిత్తం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఈయన ను మరోసారి ఇంకో అనారోగ్యం చుట్టుముట్టింది. కరోనా బారిన పడ్డాను అంటూ ఆయన తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఆయన అభిమానులంతా షాక్ కి గురయ్యారు. మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు అలాగే ప్రేక్షకులు కూడా కోరుకుంటూనే దేవాలయాల్లో అర్చనలు ,పూజలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలాఉండగా అనారోగ్యంతో బాధ పడుతున్న మహేష్ బాబును శ్రీరెడ్డి అన్న మాటలకు సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో మునిగిపోయింది. ఇకపోతే తాజాగా శ్రీ రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా మహేష్ గురించి ఇలా రాసుకొచ్చింది. మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి.. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య.. అంటూ ట్వీట్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది. ఇక అభిమానుల కూడా శ్రీ రెడ్డి ఒక్కసారిగా మహేష్ బాబు ను అన్నయ్య అని పిలవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఏ ఒక్కరిని కూడా ఇంత ఆప్యాయంగా పిలవని శ్రీరెడ్డి మహేష్ బాబును ఇలా పిలవడంతో తనలో మార్పు వస్తోంది అన్నట్లుగా కూడా భావిస్తుండటం గమనార్హం.