హీరోయిన్ అవుతాను అంటే ఇంట్లో వాళ్ళు ఒపుకోకపోయిన..ఎదురించి తెగించి అవకాశాల కోసం ట్రై చేస్తుంటే ఆ డైరెక్టర్లు ప్రోడ్యూసర్లు కమిట్ మెంట్ పేరుతో మమ్మల్ని వాడుకోవాలని చూసిన..అవి భరించి..ఫైనల్ గా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చి..సినిమాలో హీరోయిన్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందో తెలియక అల్లాడిపోతుంటారు. ఫ్లాప్ అయితే కెరీర్ ఖతం ..డైరెక్టర్లు ప్రోడ్యూసర్ల ఫ్లాప్ అయిన హీరోయిన్ల ని పట్టించుకోరు.. ఒక్కవేళ హిట్ అయితే..మేడం మేడం అంటూ వాళ్ల చుట్టు తిరుగుతారు.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. హీరోయిన్ కి ఒక్క ఫ్లాప్ పడితే వాళ్లను పట్టించుకోని డైరెక్టర్లు..వరుసగా మూడు నాలుగు ఫ్లాప్ సినిమాలు పడినా కానీ వాళ్లతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. రీజన్ ఏంటో ఎవ్వరికి తెలియదు. రెమ్యూనరేషన్ విషయం లో కూడా అంతే స్టార్ హీరోలు ఒక్కో సినిమాలి 50-70 కోట్లు తీసుకుంటారు..మరి అదే సినిమాలో నటించిన హీరోయిన్ కి మాత్రం 3 కోట్లు ఇవ్వడానికి బోలెడు కండీషన్స్ పెడతారు. ఇక దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు గొంతు చించుకున్నప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది . ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం అనే విషయ ఈ డైరెక్టర్ల ఎప్పుడు అర్ధం అవుతుందో ..మా కష్టాని తగ్గ ప్రతి ఫలం ఎప్పూడు లభిస్తుందో అని అంటున్నారు కొందరు హీరోయిన్లు. దీనినే మగాళ్ల డామినేషన్ అని అంటారు అంటూ హీరోయిన్స్ మండిపడుతున్నారు.