టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల విడుదలైన సినిమా పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు అంతంతమాత్రంగా ఉన్న కూడా ఆ తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తరువాత రోజు నుండి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. అయితే కలెక్షన్లు తగ్గింది మన తెలుగులోనే.. పరభాషలో మాత్రం పుష్ప తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది.

లేకపోతే పుష్పా సినిమా 150 కోట్ల మార్కును దాటి నట్లు తెలుస్తోంది.  ఇక అప్పుడు  "అల వైకుంఠ పురం లో" సినిమాతో ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ మళ్లీ ఇప్పుడు ఈ రేంజ్ లో కలెక్షన్లు అందుకున్న సినిమా "పుష్ప". ఇక ఊహించిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా కలక్షన్ అనుకున్నట్టుగానే అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని డిస్ట్రిబ్యూటర్లకు చిత్ర నిర్మాతలు కొంత డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని యూఏ, ఈస్ట్, గుంటూరు ఏరియాల్లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్లు రూపాయలు తిరిగి ఇచ్చేయటం విశేషం.

ఇక ఇప్పటి దాకా నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం  80 శాతం కలెక్షన్లు వచ్చాయి. అందుచేత వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు డబ్బులు ఇచ్చేయడం ఇప్పుడు చాలా ప్రశంసనీయం అని చెప్పచ్చు.ఇక పుష్ప పార్ట్ 2 షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరి కల్లా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: