డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది సాయి కుమార్ తొలి సినిమా ప్రేమకావాలితో పర్వాలేదు అనిపించుకోగా ఆ లవ్ లీ కూడా ఓ మోస్తారుగా ఆడేసింది. సుకుమారుడు నుండి వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఆదికి లక్ కలిసి రావట్లేదని చెప్పాలి. మధ్యలో శమంతకమణి అంటూ ఓ మల్టీస్టారర్ సినిమా కూడా చేశాడు. ఆ సినిమాలో ఆది సాయికుమార్ తన పాత్ర వరకు బాగా న్యాయం చేశాడు అయినా కూడా ఆ సినిమాకు అతనికి లక్ కలిసి రాలేదు.

ఆది సాయి కుమార్ సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి.. అంతేకానీఎ ఆడియెన్స్ మీద ఏమాత్రం ఇంప్యాక్ట్ క్రియేట్ చేయట్లేదు. రిలీజ్ ముందు కొద్దిగా హడావిడి చేయడం ఆ తర్వాత సినిమా వచ్చాక ఆడియెన్స్ నిరుత్సాపడటం ఇది ఆది సాయి కుమార్ సినిమాలకు కామన్ అయ్యింది. కథల విషయంలో ఆది జడ్జ్ మెంట్ బాగాలేదని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా అతిథి దేవోభవ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు వచ్చాడు ఆది.

అయితే ఆది సినిమాలు కొత్తవి కావొచ్చు కానీ రిజల్ట్ మాత్రం పాతదే అది కూడా కామనే అనేలా అతిథి దేవోభవ సినిమాకు కూడా అంత గొప్ప టాక్ ఏమి రాలేదు. యువ హీరోలు ప్రయోగాలతో సత్తా చాటుతుంటే సాయి కుమార్ లాంటి బ్యాక్ బోన్ ఉన్నా సరే ఆది సాయి కుమార్ కెరియర్ లో ఇప్పటికీ నిలకడ సాధించలేకపోతున్నాడు. 10 ఏళ్ల కెరియర్ లో దాదాపు 15 సినిమాల దాకా తీసిన ఆది సాయి కుమార్ ఇక ముందైనా కథల విషయంలో జాగ్రత్త పడి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే ఆది వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కెరియ్ర్ లో చెప్పుకునేందుకు ఒక్క సూపర్ హిట్ కూడా లేని ఈ హీరోకి ఇప్పటికీ చేతిలో నాలుగు సినిమాలు ఉండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: