ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కొందరు హీరోలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మీరు ముగ్గురు ఒక విషయంలో మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురి చేతిలో ఐదేసి సినిమాలు ఉన్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి 65 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు  తాజాగా ఆయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

 ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్లో 154 సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు బోలా శంకర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక మరో యువ దర్శకుడు వెంకీ కుడుముల తో కూడా మెగాస్టార్ తన 156 వ సినిమా చేయమన్నారు  త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెడీ అయింది. మరోవైపు ఆది పురుష్ సినిమా కూడా షూటింగ్ పూర్తి కావచ్చింది. మరోవైపు సలార్, ప్రాజెక్టు కె సినిమాల షూటింగ్ కూడా కొనసాగుతోంది.

 వీటితోపాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక రవితేజ విషయానికి వస్తే..ఈ హీరో నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరో వైపు ధమాకా సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. అటు సంక్రాంతికి రావణాసుర అనే కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఇక వీటితో పాటు పాన్ ఇండియా రేంజ్లో టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ముగ్గురు హీరోలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: