ఈగ సినిమాలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికి టీవీలల్లో వస్తే కళ్లు ఆర్పకుండా చూసే జనాలు చాలా మంది ఉన్నారు. ఈ చిత్రం మొత్తం అసలు సిసలు గ్రాఫిక్స్ మాయాజాలం ఎలా ఉంటోందో నేర్చుకున్నారు జక్కన. అయితే ఈగ లాంటి అల్ప జీవిని వెండితెరపై ఓ అద్భుత కథానాయకుడిగా మలచడం కోసం ఆయనెన్నో ప్రయోగాలు చేశారు. ఇక ఈగను యానిమేషన్లో సృష్టించడం ఒకెత్తైతే.. రియాలిటీ లైఫ్ కు దగ్గరగా భావోద్వేగాలు పలికించగలగడం మరొకెత్తు అనే చెప్పాలి మరి.
అయితే ఈ సినిమా కి హైలెట్ అని చెప్పడాం కాదు సినిమా మొత్తం సూపర్ గా ఉంటుంది. ఇక నాని సమంత మధ్య లవ్ సీన్స్..ఈగ పగ తీర్చుకునే క్రమ్మలో సుదీప్ తో చేసే కామెడీ అన్ని కలిపి సినిమా ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీని తీయ్యడాని మెయిన్ రీజన్ ఏంటో రాజమౌళొ చెబుతూ.."ఈగ అనేది చిన్న పురుగు చేతితో సులువుగా విదిలించికోగలం.. కానీ, అలాంటి జీవి మనిషి పై పగబడ్డితే.. ఆసక్తికరంగా ఉంటుందని భావించి" ఈ సినిమాను చిత్రీకరించారట. ఈ సినిమా కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్లో ఉంచినట్లు సమాచారం. అయితే ఫ్రిజ్లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో తారక్ తెలిపారు.