డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చిరుత` సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆకాశ్‌.. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత మెహబూబా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించినా.. ఈ యంగ్ హీరోకు స‌రైన స‌క్సెస్ లభించ లేదు. దాంతో చాలా కాలం ఖాళీగానే ఉన్న అకాశ్‌.. తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ అందించిన క‌థ‌తో `రొమాంటిక్‌` సినిమా చేసి ఈ మ‌ధ్యే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

అనిల్‌ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టించింది. గ‌త అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌లై యూత్‌ను అమితంగా ఆక‌ట్టుకున్న ఈ మూవీ.. ఆపై ఓటీటీలోనూ బాగానే సంద‌డి చేసింది. ఇదిలా ఉంటే.. ఆకాశ్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఆకాశ్ ఓ హాట్ బ్యూటీతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ట‌.

ఇంత‌కీ ఆ హాట్ బ్యూటీ ఎవ‌రో కాదు.. రొమాంటిక్ సినిమాలో త‌న‌కు జోడీగా న‌టించిన కేతిక శ‌ర్మ‌నే. ఈ సినిమాతో ఏర్ప‌డిన వీరిద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింద‌ట‌. ప్ర‌స్తుతం ఎవ‌రికీ తెలీకుండా సీక్రెట్‌గా ఆకాశ్‌, కేతిక‌లు ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నార‌ని గుస‌ గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో వారికే తెలియాలి.

కాగా, ఆకాశ్ పూరి ప్ర‌స్తుతం `చోర్‌బజార్‌` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. జీవన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం చోర్‌బజార్‌ నేపథ్యంలో భిన్నమైన కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇక కేతిక శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల నాగ శౌర్య హీరోగా తెర‌కెక్కిన `ల‌క్ష్య` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం మంచి మంచి అవ‌కాశాలు కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోంది. ఇప్ప‌టికే ఓ రెండు సినిమాల‌కు సైన్ కూడా చేసిన‌ట్లు స‌మాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: