నైజాం మొత్తం మీద 8 లక్షలు.. సీడెడ్ లో 3 లక్షలు.. ఆంధ్రాలో 6 లక్షలు ఏపీ తెలంగాణా కలిపి 17 లక్షలు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1 లక్ష.. మొత్తం వరండ్ వైడ్ గా 18 లక్షలతో ఆది సాయి కుమార్ కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే డిజాస్టర్ కా బాప్ అనిపించేలా అతిథి దేవోభవ నిలిచింది. కెరియర్ లో సినిమాలైతే చేస్తున్నా ఒక్క సరైన హిట్టు కూడా దక్కించుకోలేకపోతున్నాడు ఆది సాయి కుమార్.
వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇలానే అయితే ఆది సాయికుమార్ కెరియర్ రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు. అయితే వరుస ఫ్లాపులు చేస్తున్నా సరే అతనికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఐదు సినిమాలు దాకా ఉన్నాయి. మరి వాటిల్లో ఏ ఒక్కటైనా సరే అతన్ని హీరోగా నిలబెడుతుందా అన్నది చూడాలి. అతిథి దేవోభవ సినిమా అయితే ఆది సాయికుమార్ కి కెరియర్ లో ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆది సాయికుమార్ కి హిట్ ఇచ్చే సినిమా ఏది అవుతుందో చూడాలి.