అక్కినేని హీరోల సినిమాలు యూత్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఏయన్నార్, నాగార్జున సినిమాలను విశేషంగా అలరించారు. అయితే యువతరం అక్కినేని హీరోలు ఫ్యామిలీ, యూత్ అని కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వారిని అలరించే కథలతో పాటూ అక్కినేని హీరోల సినిమాల్లో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని కాంబినేషన్స్ కుదిరితే అదిరిపోతుంది. అలానే అక్కినేని హీరోలతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిరిపోతుంది. మనం నుండి రాబోతున్న బంగార్రాజు వరకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ తో అక్కినేని హీరోల సినిమా అంటే మ్యూజిక్ సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

నాగార్జున నటించిన మనం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలకు మ్యూజిక్ అందించిన అనూప్ లేటెస్ట్ గా బంగార్రాజుకి అదరగొట్టే సాంగ్స్ ఇచ్చాడు. ఇక నాగ చైతన్యకు అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నాగ చైతన్య నటించిన ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం సినిమాలకు అనూప్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక అఖిల్ సినిమాల్లో అఖిల్, హలో సినిమాలకు అనూప్ మ్యూజిక్ ఇచ్చాడు.

వీరితో పాటుగా సుమంత్ తో మళ్లీ మొదలైంది సినిమా చేస్తున్నాడు అనూప్. సుశాంత్ ఆటాడుకుందాం రా సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ఇక ఇప్పుడు అదే సినిమా ప్రాక్వల్ గా వస్తున్న బంగార్రాజుకి అనూప్ మ్యూజిక్ మళ్లీ అదరగొట్టబోతుందని అంటున్నారు. అక్కినేని హీరోల సినిమాలకు అనూప్ సూపర్ హిట్ సెంటిమెంట్ మళ్లీ ఈ సినిమాకు కలిసి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. బంగారాజులో అనూప్ రూబెన్స్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశాయి. తప్పకుండా బంగార్రాజు కూడా అక్కినేని హీరోలకు మరో మంచి మ్యూజిక్ హిట్ అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: