2022 సంక్రాంతి బరిలో బంగార్రాజు తో పాటుగా ఇద్దరు కొత హీరోల సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి బడా నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న ఆశిష్ రౌడీ బోయ్స్ సినిమాతో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా హీరో సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా బంగార్రాజుకి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. పొంగల్ పోరులో కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమాకే ఎక్కువ స్కోప్ ఉందని అనుకున్నారు.

అయితే డెబ్యూ హీరోల సినిమాలు రౌడీ బోయ్స్, హీరో సినిమాల ట్రైలర్ చూశాక. ఈ సినిమాలు కూడా రేసులో ధీటుగానే పాల్గొనబోతున్నాయని అనిపిస్తుంది. బంగర్రాజుకి ఈ రెండు సినిమాలు గట్టి పోటీ ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సెంటిమెంట్ తో ఈసారి సంక్రాంతికి తన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలని చూస్తున్నారు నాగార్జున. ఇద్దరు కొత్త హీరోలతో బాక్సాఫీస్ ఫైట్ కి దిగుతున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బంగార్రాజుకి పోటీగా వస్తున్న సినిమాలు రెండు ట్రైలర్స్ తో మంచి ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాల విషయంలో నాగ్ చాలా లైట్ తీసుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో రౌడీ బోయ్స్ వస్తుంటే.. హీరో సినిమా కూడా తనని తాను హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే యువకుడి కథతో వస్తుంది. రౌడీ బోయ్స్, హీరో రెండు సినిమాల ట్రైలర్స్ మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. బంగారాజు వర్సెస్ రౌడీ బోయ్స్ వర్సెస్ హీరో సినిమాల్లొ ఏదో సంక్రాంతికి విజయం సాధిస్తుందో చూడాలి. నాగార్జున మాత్రం ఈ సంక్రాంతి బంగార్రాజుదే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: