నిర్మాత కొడుకుగా తెరంగేట్రం చేసి ఇన్నాళ్లు మెగా కాంపౌండ్ హీరోగా నెట్టుకొచ్చిన అల్లు అర్జున్. సొంత ఇమేజ్ కోసం బాగా కష్టపడ్డాడు. సినిమా కోసం బన్నీ పడే కష్టం గురించి అతనితో పనిచేసే వాళ్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తానొక స్టార్ అవ్వాలని బలమైన సంకల్పం అల్లు అర్జున్ ని అలా నడిపించింది. ఇన్నాళ్లు మెగా హీరో అనిపించుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఓ సెపరేట్ ఆర్మీ ఏర్పాటు చేసుకున్నాడు. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన బన్నీ లేటెస్ట్ గా వచ్చిన పుష్ప సినిమాలో తన సత్తా ఏంటన్నది నేషనల్ వైడ్ గా ప్రూవ్ చేసుకున్నాడు.

సరైన పాత్ర పడాలే కానీ తానేంటి అన్నది ప్రూవ్ చేసుకుంటా అనుకుంటూ ఉన్న బన్నీకి పుష్ప రాజ్ పాత్ర పడింది. సుకుమార్ సినిమాలో కథ, కథనాలతో పాటుగా హీరో క్యారక్టరైజేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ దాన్ని పూర్తిగా పట్టేశాడు. అందుకోసం అతనెంత హోం వర్క్ చేశాడో తెలియదు కానీ అల్లు అర్జున్ కాదు తెర మీద పుష్ప రాజ్ కనిపించాడు.

సినిమాలో ప్రతి సన్నివేశంలో అల్లు అర్జున్ పడిన కష్టం, తపన కనిపిస్తుంది. అందుకే అతన్ని ఐకాన్ స్టార్ ని చేశారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. పుష్ప సినిమాలో డైలాగ్ లానే ఇది సార్ నా బ్రాండ్ అని బన్నీ తన టాలెంట్ చూపిస్తున్నాడు. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటన సెలబ్రిటీస్ ని కూడా షాక్ అయ్యేలా చేసింది. పుష్ప పార్ట్ 1 బన్నీ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యింది. పార్ట్ 2 అంతకుమించి ఉంటుందని అన్నారు. మరి అది ఎలా ఉంటుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: