ఇక భవిష్యత్తులో కూడా బన్నీ వీలైతే ఇదే తేదీన సినిమాను విడుదల చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే అల్లు అర్జున్‌కు మళ్లీ మళ్లీ విజయాలను ఇచ్చిన రోజుగా జనవరి 12వ తేదీ నిలిచిందని అన్నారు. అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సక్సెస్ సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పుష్ప ది రైజ్ అంచనాలను మించి కలెక్షన్లను సాధించి ఏపీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించడం గమనార్హం అనే చెప్పాలి.
అయితే ఏపీలో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏపీలోనే లాభాలను సొంతం చేసుకోలేదనే చెప్పాలి. ఇక మరోవైపు ఓటీటీలో పుష్ప మూవీ అందుబాటులోకి రావడంతో పుష్ప సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక్కసారిగా కలెక్షన్లు తగ్గించాయనే చెప్పాలి మరి. అల్లు అర్జున్ సినీ జీవితంలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రైజ్ నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. కాగా.. మరోవైపు దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత పుష్ప ది రూల్ లో సుకుమార్ చేస్తున్న మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయని ఫిలిం మేకర్స్ అంచనా వేస్తున్నారు.