బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి చేసుకున్న కొద్దిరోజుల్లోనే బిగ్ బాస్ నుండి వచ్చిన అప్డేట్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ని అలరించింది. బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పటిలానే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలవుతుందని తెలుస్తుండగా ఈలోగా బిగ్ బాస్ లవర్స్ కోసం ఫస్ట్ టైం తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ తెలుగుని ఏర్పాటు చేస్తున్నారు. యాజిటీజ్ బిగ్ బాస్ షోలానే కొనసాగుతుంది కానీ ఇది మాత్రం ఓటీటీ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది.

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి సంబందించిన కంటెస్టంట్స్ సెలక్షన్స్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి నుండే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రాబోతుందని టాక్. అయితే ఈ తెలుగు ఓటీటీ బిగ్ బాస్ కోసం స్టార్ కంటెస్టంట్స్ ని తీసుకుంటున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓటీటీ కోసం టాలీవుడ్ టాప్ సింగర్ హేమచంద్రని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగులో ప్రతి సీజన్ లో ఒక సింగర్ కంటెస్టంట్ గా ఉంటాడు.

సీజన్ 3 విన్నర్ గా రాహుల్ టైటిల్ విజేత గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ కోసం హేమచంద్రని సెలెక్ట్ చేశారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా లో దోస్తీ సాంగ్ పాడిన హేమచంద్ర సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ ఓటీటీ లో హేమచంద్ర కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ కూడా ప్రేక్షకులు మెచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో ఉన్న పాపులర్ సింగర్స్ లో హేమచంద్ర ఒకరు. మరి హేమచంద్ర బిగ్ బాస్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయితే మాత్రం ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: