ఇకపోతే అనసూయ జబర్దస్త్ స్టేజ్ పైన యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఒకవైపు తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరొకవైపు అందాల ప్రదర్శన ఇస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.. యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినీ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
తాజాగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే అనుసూయ తాజాగా లంగా ఓణీ లో పరువాల విందు చేస్తూ అందరినీ అలరిస్తూ వస్తోంది. గ్రీన్ కలర్ బ్లౌజ్.. ఎల్లో కలర్ లంగా తో గ్రీన్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఓణీ ధరించి చూసినవారు చూపు తిప్పుకోకుండా చేస్తోంది. అంతేకాదు ఈమెను ఇలా చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందాలు అద్దిన బుట్ట బొమ్మ అంటూ తెగ పొగిడేస్తున్నారు.