రష్మిక మందన్న 'పుష్ప' హిట్‌తో క్లౌడ్ నైన్‌లో ఉంది. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయిన 'పుష్ప' క్రెడిట్ మొత్తం సుకుమార్, అల్లు అర్జున్‌కే వెళ్లిపోయినా, రష్మికకి మైలేజ్ ఇచ్చింది. తమిళ్, మళయాళీ, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కింది. ఈ క్రేజ్‌తో రెమ్యూనరేషన్‌ని కూడా పెంచేసిందట రష్మిక. మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు అడుగుతోందట రష్మిక.
సిద్ధార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లింది రష్మిక మందన్న. ఈ సినిమా పూర్తికాకముందే అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం అందుకుంది. బిగ్‌బితో కలిసి 'గుడ్‌బై' అనే మూవీ చేస్తోంది. దీంతో సౌత్ హీరోయిన్ లెవల్ నుంచి పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారింది రష్మిక. అందుకే ఇంతకుముందు 2 కోట్ల వరకు తీసుకున్న రష్మిక ఇప్పుడు మూడున్నర కోట్ల వరకు అడుగుతోంది.
తెలుగుతో పాటు, హిందీలో కూడా రష్మిక మందన్న భారీగానే డిమాండ్ చేస్తోందట. రష్మిక ఉంటే హిందీ సినిమాలకు సౌత్‌లో ప్లస్ అవుతుంది. అదే తెలుగు సినిమాల్లో రష్మిక ఉంటే నార్త్‌కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు రెండు చోట్లా భారీగా డిమాండ్ చేస్తోంది. నిర్మాతలు కూడా క్రేజ్ చూసి అడిగినంత చెల్లిస్తున్నారు.
మొత్తానికి రష్మిక పారితోషికం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన డిమాండ్ ను బట్టి పెంచుకుంటూ పోతోంది. పాన్ ఇండియన్ ఇమేజ్ ను చక్కగా వాడుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనను అమలు చేస్తోంది రష్మిక. పుష్ప హిందీలో సైతం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో రష్మిక కోసం క్యూలో నిల్చుంటున్నారు సినీ మేకర్స్.