అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నిటిని తీసుకెళ్లే ప్రయత్నం చేశానని చిరంజీవి తెలియజేశాడు. అందుకు మధ్యాహ్న భోజన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశానని కూడా తెలియజేశారు. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమ గురించి కొన్ని కీలక విషయాలను కూడా మాట్లాడడం జరిగిందని తెలియజేశారు. ఏపీ సీఎం సానుకూలంగానే స్పందించారని తెలియజేశారు.. ఇక ఆ తర్వాత ఇంటికి బయలుదేరి సందర్భంగా అక్కడ ఉండే కొంతమంది మీడియాతో మాట్లాడారు. మరొకసారి పెద్దరికం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంపై ఇప్పుడు టాలీవుడ్ హీరో మోహన్ బాబు ఏం చేస్తారనే విషయం అందరికీ ఆసక్తికరంగా మారుతోంది.
టాలీవుడ్ పెద్దరికం గురించి ఇటీవల చిరంజీవి మాట్లాడగానే.. ఆ రోజు సాయంత్రం వేళ మోహన్ బాబు ఒక లేఖను రాసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇక లేఖ సినీ పెద్ద అంటే ఎలా ఉండాలో వ్రాయడం జరిగింది. ఇక ఆ తర్వాత మోహన్ బాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా చిరంజీవి వెళ్లి జగన్ ను కలిశారు కదా.. ఇక మోహన్ బాబు ఏదో ఒకటి చేయాలి.. ఏదో ఒక సాకుతో కచ్చితంగా జగన్ ని కలుస్తారు అందులో సినిమా పరిశ్రమ గురించి చర్చించామని తెలియజేస్తారు ఇక అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పొచ్చు అంటూ కొంతమంది తెలియజేస్తున్నారు. లేదంటే లేఖ అయినా విడుదల చేస్తారేమో చూడాలి. మరి మోహన్ బాబు ఏం చేస్తారో చూద్దాం.