అయితే గతంలో హీరో అఖిల్ కి నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక అఖిల్, శ్రీయా భూపాల్ ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిపించారు. శ్రీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త జివికే కంపెనీల అధినేత మనవరాలు. అయితే అఖిల్- శ్రీయా భూపాల్ ల వివాహం ఇటలీలో జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు అనుకున్నారు. ఏమైందో తెలీదు కానీ.. అంతలోనే అఖిల్, శ్రీయల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ వినపడింది. దాంతో వారిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టకుండానే వారి పెళ్లికి శుభం కార్డు పడిన సంగతి అందరికి తెల్సిందే.
తాజా సమాచారం మేరకు.. అక్కినేని ఇంటికి త్వరలోనే కొత్త కోడలు రాబోతోందని సమాచారం. ఇటీవల కాలంలో ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన సమంత విడాకులు తీసుకొని మధ్యలోనే వెళ్లిపోయిన సంగతి అందరికి తెల్సిందే. దాంతో నాగార్జున చిన్న కోడలిని తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిల్ పెళ్లి త్వరలో చేయాలని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక .ఇప్పటికే అఖిల్ పెళ్లి కోసం నాగార్జున మంచి సాంప్రదాయ పద్ధతిలో కలిగిన కుటుంబం నుంచి ఓ అమ్మాయిని చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి. చిత్ర పరిశ్రమకి సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం నాగార్జున ఏరికోరి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ కి సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.