మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా సర్కారు వారి పాట పై మంచి అంచనాలు ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచింది. అయితే విషయం ఏమిటంటే కొద్దిరోజుల క్రితం మహేష్ కి కరోనా పాజిటివ్ రావడంతో పాటు ఆయన సోదరుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడంతో ఘట్టమనేని కుటుంబం మొత్తం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. దానితో ఇప్పట్లో మహేష్ సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ చేసే ఛాన్స్ లేదని, అందుకే కొన్నాళ్ల పాటు యూనిట్ కూడా ఆయని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని సమాచారం. మరోవైపు ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తాం అంటూ కొన్నాళ్ల క్రితం ప్రకటించిన యూనిట్, ప్రస్తుత పరిస్థితుల తో పాటు టీమ్ లోని చాలా మందికి కరోనా సోకిందని, దయచేసి పరిస్థితులని అర్ధం చేసుకుని సహకరిస్తే తప్పకుండా త్వరలోనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తాం అంటూ యూనిట్ రెండు రోజుల క్రితం తెలిపింది.
అయితే మరోవైపు ఈ సినిమాని ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నాం అంటూ యూనిట్ ప్రకటించడం, అదే రోజున మెగాస్టార్ ఆచార్య సినిమా రిలీజ్ కానున్నట్లు నిన్న ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అసలు తమ హీరో సినిమా విషయమై ఏమి జరుగుతుందో అర్ధం కాక మెంటలెక్కుతోందని, ఓవైపు సాంగ్ రిలీజ్ డేట్ ఇప్పటివరకు యూనిట్ వెల్లడించకపోవడం, మరోవైపు తమ సినిమా రిలీజ్ రోజున ఆచార్య కూడా రిలీజ్ బెర్త్ ఖాయం చేయడంతో సర్కారు వారి పాట వాయిదా కూడా పడే ఛాన్స్ కనపడుతోందని వారు వాపోతున్నారు. అయితే సర్కారు వారి పాట మూవీ విషయమై పూర్తి సందిగ్ధాలు తొలగి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.