ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ కృతి శెట్టి. ఈమె తొలి సినిమాతో సాధించిన విజయం అంతా ఇంతా కాదు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మైమరపించి గోల్డెన్ లెగ్ అని అప్పుడే నిరూపించుకుంది. ఆ విధంగా తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మను తమ సినిమాలలో పెట్టుకోవడానికి క్యూలు కట్టారు మేకర్స్. అలా నాని హీరోగా శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంను రెండో చేసి హిట్ కొట్టి ఫ్లాప్ లలో ఉన్న నాని కి మంచి హిట్ ను అందించింది. ఇక ఆమె హీరోయిన్ గా చేసిన బంగార్రాజు చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి సూపర్ హిట్ అయ్యింది.
దీంతో వరుసగా మూడు సినిమాలు హిట్టయ్యేసరికి ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ గా అవతరించింది. పెద్ద హీరోలు లు సైతం ఈమెను పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల హీరోలకు హిట్ తీసుకువస్తుందా అనేది ఎంతో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తుంది. అలాగే రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు సక్సెస్ అవసరం ఉన్న నేపథ్యంలో కృతి శెట్టి వారి పాలిట సక్సెస్ దేవతగా అవతరిస్తుందో చూడాలి.