ఇద్దరు సీనియర్ హీరోలు..ఒకరిది సంక్రాంతి విడుదల..ఇంకొందరిది సినిమా విడుదలయి సక్సెస్ కొట్టేసిన సందర్భం..అయినా కూడా కలెక్షన్లలో పోటీ మామూలుగా లేదు.. అఖండ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు.ఇప్పుడు కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీసుకు పూనకాలు తెప్పిస్తున్నాడు.రిపీటెడ్ ఆడియెన్స్ ఈసినిమాకు ప్లస్.ఆ విధంగా బాలయ్య గ్రేట్ హిట్ కొట్టాడనే అనాలి.కానీ నాగ్ మూవీ రిజల్ట్ మాత్రం సో సో ...
బాలయ్య - బన్నీకలిసి సాధించిన సక్సెస్ అఖండ..నో డౌట్ ఇన్ ఇట్..బాలయ్య మాత్రమే చేయదగ్గ క్యారెక్టర్ అఖండ.. నాగ్ మాత్రమే చేయదగ్గ క్యారెక్టర్ బంగార్రాజు..మరి! ఏంటి తేడా? ఎక్కడ బెడిసికొట్టింది? అన్న వివరాలు ఆరాతీస్తే..బాలయ్య సినిమాలో మంచి కంటెంట్ తో పాటు ఫ్యాన్స్ కావల్సినవి అన్నీ ఉన్నాయి..మాస్ మసాలకు కేరాఫ్ ఆ సినిమా. కానీ బంగార్రాజు సినిమా ఇదివరకు చూసిన సినిమాలానే ఉంటుంది.పెద్దగా కథ పరంగా చేసిన కసరత్తు ఏమీ ఉండదు. ఇక స్క్రీన్ ప్లే పరంగా అస్సలు బాలేదు అన్న టాక్ మొదటి రోజునే వచ్చేసింది.ఈ సినిమాకు ప్లస్ నాగ్..మైనస్ స్క్రీన్ ప్లే.. ఇంకా చెప్పాలంటే నాగ్ లేకపోతే కేవలం నాగ చైతన్యతోనే కథ నడిపిస్తే ఈ సినిమా డిజాస్టర్ కావడం ఖాయం.
బంగార్రాజు కనుమ రోజు కలెక్షన్ - 1,95,930
అఖండ కనుమ రోజు కలెక్షన్ - 2,04,160
హైద్రాబాద్ - ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కలెక్షన్ డేటా ఇది..
ఆ లెక్కన బంగార్రాజు కన్నా అఖండ కలెక్షన్ అదిరిపోయిందని ప్రూవ్ అయింది.ఓపెనింగ్స్ లో కూడా అఖండ సినిమా బంగార్రాజును ఎప్పుడో దాటేసింది.ఆ మాటకు వస్తే ఓవర్సీస్ డేటాలో కూడా అఖండ సినిమానే టాప్ స్కోర్ ను గైన్ చేసింది.ఈ విధంగా అయినా ఏ విధంగా అయినా బంగార్రాజు బాలయ్య బాబు జోరును అందుకోలేక చతికిలపడ్డాడు.మొదట్నుంచి అఖండ సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తూనే ఉంది.బోయపాటి బిల్డప్ షాట్స్,కొద్దిగా అతిగా అనిపించినా కూడా బాలయ్య బాబు ఫైట్స్, అంతేకాకుండా థమన్ తన శక్తిని మించి అందించిన రీ రికార్డింగ్ ఇవన్నీ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.ఆ లెక్కన చూసుకుంటే అనూప్ సంగీతం బంగార్రాజు సినిమాకు ఓకే అనిపించినా థమన్ ను ఆయన దాటి రాలేకపోయాడు.ఆర్ఆర్ కు అఖండ టీం ఖర్చు చేసినంత నాగ్ ఖర్చు చేయలేదు.ఆ విధంగా సౌండ్ క్వాలిటీ పరంగా అఖండ అదరగొట్టాడు. వీఎఫ్ఎక్స్ పరంగా కాస్త స్కోప్ ఉన్న సినిమా బంగార్రాజు కనుక ఆ విభాగంలో మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ టీం కాస్త ఎక్కువ ఎఫెర్ట్ పెట్టిందనే టాక్.