కోలీవుడ్ లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండే ఆండ్రియా తన లైఫ్ లో ఓ పెద్ద తప్పు చేశానని.. కొన్ని బలహీన క్షణాలు తనని అలాంటి తప్పు వైపు నడిపించాయని ఒకరితో తను చేసిన సీరియస్ రిలేషన్ షిప్ గురించి చెప్పి బాధపడ్డది ఆండ్రియా. ఇక ఓ ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ తో అమ్మడు లిప్ లాక్ చేసిన ఫోటో లు అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోలీవుడ్ గాసిప్స్ లో మొదట చెప్పుకునే రెండు మూడు పేర్లలో ఆండ్రియా ఉంటుంది.
సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఆండ్రియా. లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్, బెడ్ సీన్స్ ఎలాంటి వాటికైనా రెడీ అని చెప్పే ఆండ్రియా ఇప్పటికీ తానొక హీరోయిన్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. తెలుగులో కేవలం తడాఖా సినిమా మాత్రమే చేసిన ఆండ్రియా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి పూర్తి ఫోకస్ కోలీవుడ్ మీదే పెట్టింది. 2021 లో 3 సినిమాలు 2022లో ఏకంగా ఐదు సినిమాల్లో అమ్మడు నటిస్తుంది.