ఎవరి పని వారు చేసుకుంటే నాలుగు రాళ్లు వెనుక వేసుకోవచ్చు అనేది సినిమా పరిశ్రమలో ఎప్పట్నుంచో ఉన్న ఒక ప్రధానమైన సూత్రం. ఒక డిపార్ట్మెంట్ పని చేసుకునే వ్యక్తి మరొక డిపార్ట్మెంట్ లోకి వెళ్లి కాలు చేయి చేసుకొని చేతులు కాల్చుకోవడం మనం చాలాసార్లు చూసాము. కొంతమంది తమ కెరీర్ కు స్వస్తి చెప్పిన సందర్భాలు కూడా మనం చూశాం. అయినా కూడా కొంతమందికి మాత్రం దొడ్డి దారిన ఎదగాలనే ఉబలాటం తగ్గడం లేదు. అలా నటీనటుల విషయంలో కమెడియన్ కమెడియన్ గా చేయడం హీరో హీరో గా చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి.

అయితే కమెడియన్ హీరో అవ్వడం అనేది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం.అలా ఒకటి రెండు సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది కానీ కమర్షియల్ హీరోగా సత్తా చాటాలని చూస్తే మాత్రం బొక్క బోర్లా పడడం ఖాయం. దానికి నిదర్శనమే సునీల్. ఆయన అందాలరాముడు సినిమా తన బాడీ లాంగ్వేజ్ కి తన ఇమేజ్ కి సూట్ అయ్యింది కాబట్టి హీరోగా చేశాడు అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చిన మర్యాద రామన్న సినిమా కూడా తన ఫిజిక్ కి తగ్గ సినిమా కాబట్టి అది కూడా హీరోగా చేశాడు. అక్కడి వరకు బాగానే ఉంది.

కానీ ఆ తర్వాత ఆయన కమెడీయన్ సినిమాలు చేసుకుంటే పోయేదేమో అలా కాకుండా వరుసగా హీరోగా సినిమాలు చేసి భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు హీరోగా కమెడియన్ గా కాకుండా ఉండిపోయాడు. ఇది సునీల్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తన తప్పు తెలుసుకున్న సునీల్ మళ్లీ కమెడియన్ గా స్థిరపడడానికి ట్రై చేస్తున్నాడు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అదే తప్పు సప్తగిరి విషయం చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు మనం అందరం గమనించాలి. ఆయన హీరో మోజులోపడి కమెడీయన్ సినిమాలు చేయడం తగ్గించారు. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: