అందుకే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసిన శ్రీ లీల లేటెస్ట్ గా మెగా హీరో మూవీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. మెగా హీరోలతో సినిమా అంటే శ్రీలీల కెరియర్ టర్న్ అయినట్టే లెక్క. అంతేకాదు వరుస ఛాన్సులు అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు.
వైష్ణవ్ తేజ్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో గిరీశయ్య డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తెలుగుతో పాటుగా అమ్మడు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగు కన్నడ భాషల్లో వరుస అవకాశాలతో శ్రీలాల తన సత్తా చాటాలని చూస్తుంది. మెగా హీరోలతో ఛాన్స్ అంటే తప్పకుండా అమ్మడికి మంచి క్రేజ్ దక్కించుకునే అవకాశం వచ్చినట్టే లెక్క. తెలుగులో హీరోయిన్స్ కొరత ఉన్న ఈ టైం లో శ్రీలీల వరుస అవకాశాలతో అదరగొట్టేస్తుంది. యువ హీరోలతో జోడీ కడుతున్న అమ్మడు స్టార్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డ ఈ అమ్మడికి టాలీవుడ్ లో మంచి కెరియర్ ఉండేలా ఉంది.