రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుకుమార్ తీయగా మైత్రి మూవీ మేకర్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ మూవీలో పుష్ప రాజ్ గా మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటనకి అన్ని భాషల ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ లో నటిస్తున్న అల్లు అర్జున్ త్వరలో బోయపాటి శ్రీను ఒక సినిమా చేయనున్నట్లు టాక్. అయితే అది మాత్రమే కాక నేడు పలు ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతున్న ఒక న్యూస్ ప్రకారం నేడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించారని, అది ఎంతో నచ్చిన అల్లు అర్జున్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం.
కాగా ఈ సినిమాలో ఒక స్టార్ నటి కథానాయికగా నటించనుండగా యువ సంగీత దర్శకుడు అనిరుద్ స్వరాలు సమకూర్చనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ క్రేజీ కాంబో పై అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎంత మేర బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుందో తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.