బుల్లితెర మరియు వెండి తెర నటి అయిన శ్వేత తివారీ ప్రేక్షకులకు బాగా పరిచయమే. అయితే ఈమె ఇపుడు తన అనాలోచిత వ్యాఖ్యల వలన సమస్యల్లో చిక్కుకుంది. ఏకంగా దేవుడనే కించపరిచేలా ఉన్న ఆమె మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే ప్రస్తుతం ఓ ప్రముఖ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ సుందరి ఆ వెబ్ సిరిస్ కి సంబందించి వివరాలు తెలిపేందుకు బుదవారం నాడు భోపాల్ లో మీడియా మీటింగ్ ఏర్పాటు చేయగా అందుకు హాజరైంది.

శ్వేత తివారీ తన కొత్త వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతున్న తరుణంలో మాటల మద్యన తనలో దుస్తుల గురించి మాట్లాడింది. అంతటితో ఆగితే అయిపోయుండేది. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సహా నటుడు సౌరభ్ జైన్ అంతకు ముందు మహాభారతం లో శ్రీకృష్ణుని పాత్రలో చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ అతని పేరు తీస్తూ దేవుడు అయిన సౌరభ్ జైన్ న బ్రా కొలతలు తీసుకుంటాడు అని అనడంతో ఇది హాట్ టాపిక్ అయింది. ఈ మాటలు దేవుని వక్రీకరించి మాట్లాడిందని ఆమెపై హిందుత్వ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. దేవుడిని ముడిపెట్టి ఇలా అనడం సబబు కాదు అంటూ సోషల్ మీడియాలో శ్వేతా తివారీని ట్రోల్ చేస్తున్నారు.

హిందువులను, దేవుళ్ళను కించపరిచేలా శ్వేత వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ అంతా మండిపడుతున్నారు. దాంతో ఈ విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పక్ష స్టాపర్ అనే వెబ్ సిరీస్ ఇది. ఇందులో శ్వేత బ్రా ఫిట్టర్ పాత్ర ను పోషిస్తున్నారు. త్వరలో డిజిటల్ స్క్రీన్ పై విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా ఇలా వివాదాలు తలెత్తడంతో  ఆ వెబ్ సిరీస్ నిర్వాహకులకు కూడా కొత్త చిక్కొచ్చి పడ్డట్లు అయింది. అయితే ఇలా జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. మాములుగా ఇలాంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి కానీ మీడియా వలన కొన్ని మాత్రమే హైలైట్ అవుతూ ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: