కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, తమిళనాట అనేక హిట్టు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో  కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది చాలా రోజుల క్రితం హీరో విజయ్ లండన్ నుంచి లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు, దీనికి ఎంట్రీ టాక్స్ ను  చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాక హైకోర్టులో విజయ్ పై పిటిషన్ ను వేశారు.

ఈ విషయంపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలి అని ఉత్తర్వులను జారీ చేశారు, అది మాత్రమే కాకుండా టాప్ స్టార్స్ ఇలా పన్నులు ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనితో హీరో విజయ్ ఎంట్రీ ట్యాక్స్ చెల్లించారు, అయితే తనపై ప్రత్యేక న్యాయమూర్తి వ్యక్తిగతంగా చేసిన  వ్యాఖ్యలను రద్దు చేయలంటూ హీరో విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిగింది, ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని హైకోర్టు ఉత్తర్వు లను జారీ చేసింది. ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది, పన్ను మినహాయింపు కేసు ఇంకా కోర్టులో పెండింగ్‏లో హీరో విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ వాణిజ్య పన్నుల శాఖను ఆదేశిస్తూ కోర్టు మధ్యంతర స్టే ఆర్డర్‏ జారీ చేసింది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బీస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా పూర్తి అవగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోయే ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: