మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రావణాసుర, ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది, ఈ సినిమాలో అనూ ఇమాన్యుల్, ఫారియా అబ్దుల్లా, మేఘ ఆకాష్,  పూజితా పొన్నాడా, దక్ష నగర్కార్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై కూడా అంచనాలను పెంచేశాయి, ఇప్పటివరకు రావణాసుర చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లను పరిశీలిస్తే ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  అలాగే సుశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ ఈ సినిమాతో పాటు ఇప్పటికే ఖిలాడి సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు, ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. రవితేజ ఈ సినిమాలతో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: