సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇటీవల స్పెయిన్ లో తన మోకాలికి సర్జరీ చేయించుకుని కొన్నాళ్ల రెస్ట్ తరువాత ఇండియాకి తిరిగివచారు. అయితే ఆ తరువాత ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి పూర్తిగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మహేష్ కొన్నాళ్ల క్రితం తన సోదరుడు రమేష్ బాబు పెద్ద కర్మ సమయంలో బయటకు వచ్చారు. అంతకముందు రెండు రోజుల క్రితం మహేష్ కి నెగటివ్ వచ్చింది.

ఇక అక్కడి నుండి తన ఆరోగ్యం విషయమై మరింత శ్రద్ధ తీసుకుంటున్న సూపర్ స్టార్ త్వరలో సర్కారు వారి పాట షెడ్యూల్ కోసం పూర్తిగా సిద్ధం అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరశురామ్ పెట్ల తీస్తుండగా మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం పలు సెట్స్ సిద్ధం చేసిందట యూనిట్. అయితే విషయం ఏమిటంటే, నేటి లాస్ట్ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొనడం లేదని ఫిబ్రవరి రెండవ వారంలో ఆయన షూట్ లో జాయిన్ అవ్వనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు సినిమాలో మిగిలిన ఆఖరి సాంగ్ ని కూడా అదే సమయంలో చిత్రీకరించిన అనంతరం సినిమాకి సంబందించిన నిర్మాణాంతర కార్యక్రమాలని యూనిట్ మొదలెట్టనుందని, అలానే సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ 1 కాకుండా మరికొన్నాళ్లు పాటు వాయిదా పడే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే దీనిపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: